News September 11, 2025
KU పీజీ ఫలితాలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ వివిధ పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏ(పొలిటికల్ సైన్స్) 4వ సెమిస్టర్ మే, ఎంఏ(ఎంసీజే) మొదటి సెమిస్టర్ ఏప్రిల్, ఎంఎస్సీ(ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్ జూన్, ఎంఏ(ఇంగ్లిష్) మొదటి సెమిస్టర్ మార్చి-2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాల కోసం www.kuexams.org యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News September 11, 2025
గోదావరిఖని: సీఐటీయూ బ్యాలెట్ ద్వారా అభిప్రాయాల సేకరణ

సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కావాలా.. క్వార్టర్ కావాలా అనే విషయంపై అభిప్రాయాలను సేకరించేందుకు CITU-SCEU ఆధ్వర్యంలో ఆర్జీ1 ఏరియాలో గురువారం ఓటింగ్ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. ఆర్జీ 1 ఏరియాలోని జీఎం ఆఫీస్, ఎస్‌అండ్‌పీసీ, జీడీకే 1, 2, 2ఏ, ఓసీపీ 5, వర్క్‌షాప్, ఎక్స్‌ప్లోరేషన్, సివిల్ విభాగాల్లో ఓటింగ్ చేపట్టారు. కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని అభిప్రాయాలను తెలిపారని నాయకులు
చెప్పారు.
News September 11, 2025
గోదావరిఖని: టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీగా కొయ్యడ మల్లేశ్

సింగరేణి ఆర్జీ-1 ఏరియాలో కోల్ ల్యాబ్ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్న కొయ్యడ మల్లేశ్ టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీగా నియమితులయ్యారు. టీబీజీకేఎస్ ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ వడ్డెపల్లి శంకర్ కొయ్యడ మల్లేశ్‌ను నియమిస్తూ గురువారం నియామకపు ఉత్తర్వులు అందజేశారు. తనను నియమించినందుకు కొయ్యడ మల్లేశ్ కృతజ్ఞతలు తెలిపారు. టీబీజీకేఎస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
News September 11, 2025
తాతయ్యగుంట గంగమ్మ సేవకులు వీరే:

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పాలకమండలిని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. సభ్యుల వివరాలు:
☞ మహేష్ యాదవ్ ☞ గుణ ☞ భాగ్యవల్లి ☞ రాజా రుద్ర కిషోర్
☞ వరలక్ష్మి ☞ విమల ☞ చంద్రశేఖర్ ☞ శ్యామల ☞ మధులత
☞ లక్ష్మణరావు.
☞ మొత్తం 41 మంది పేర్లు పరిశీలనకు వెళ్లాయి.
☞ వీరిలో మహేష్ యాదవ్ ఛైర్మన్‌గా నియామకం అయ్యే అవకాశం ఉంది.