News September 11, 2025

పాక్‌తో మ్యాచ్.. ఆసక్తి చూపని IND ఫ్యాన్స్?

image

INDvsPAK మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. మ్యాచ్ ఎక్కడ జరిగినా క్షణాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. అయితే UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈనెల 14న జరిగే దాయాదుల మ్యాచ్‌పై భారతీయులు ఆసక్తి చూపించట్లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచుకు మరో 2 రోజులే ఉన్నా టికెట్స్ ఇంకా సేల్ అవలేదట. పహల్గామ్ అటాక్ కారణంగా PAKతో మ్యాచ్‌పై భారతీయులు ఆసక్తిగా లేరని అంటున్నాయి.

Similar News

News September 11, 2025

సీఎం ఆలోచనలతో నీటినిల్వలు పెరిగాయి: నిమ్మల

image

AP: సీఎం చంద్రబాబు ఆలోచనలు సత్ఫలితాలిచ్చాయని మంత్రి నిమ్మల తెలిపారు. ‘గతేడాదితో పోల్చితే వర్షపాతం తక్కువైనా భూగర్భజలాలు, రిజర్వాయర్లలో నీటినిల్వలు ఉన్నాయంటే CM వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైంది. తుంగభద్ర, శ్రీశైలం, కాటన్ బ్యారేజ్, గోరకల్లు రిజర్వాయర్, హంద్రీనీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ఐదేళ్లలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలోనే చేశారు. కరవు లేకుండా చేయడమే CM లక్ష్యం’ అని స్పష్టం చేశారు.

News September 11, 2025

ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టుగా ఎదిగాం: RCB

image

బెంగళూరు తొక్కిసలాట ఘటన తర్వాత SM నుంచి విరామం తీసుకున్న RCB కొద్దిరోజులుగా వరుస ట్వీట్స్ చేస్తోంది. తాజాగా IPL లీడర్‌బోర్డ్‌ను షేర్ చేసింది. ‘బర్నింగ్ డిజైర్, కన్సిస్టెంట్ అప్రోచ్, బోల్డ్ ప్రామీస్.. ఈ ప్రయాణమే మనల్ని ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టుగా నిలబెట్టింది. నిజాయితీ, నమ్మకంతో ఒక్కో మెట్టును పేర్చుతూ నిర్మించుకున్నాం’ అని పేర్కొంది. కాగా 2020 నుంచి RCB 90 మ్యాచ్‌ల్లో 50 విజయాలతో టాప్‌లో ఉంది.

News September 11, 2025

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని <>మౌలానా <<>>ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 27 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 29వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీటెక్/బీఈ, ఐటీఐ, టెన్త్ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.