News September 11, 2025
విజయవాడ: ఆ ఆసుపత్రిలో ఎక్విప్‌మెంట్ ఫుల్.. సిబ్బంది నిల్

రాణిగారితోటలోని పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్ర సేవలకు సిబ్బంది కొరత వేధిస్తోంది. ల్యాబ్ టెక్నిషియన్, డాక్టర్, ఫార్మసిస్ట్ లేకపోవడంతో ప్రస్తుతం ఇద్దరు స్టాఫ్ నర్సులే ఈ కేంద్రానికి వచ్చే రోగులకు సేవలు అందిస్తున్నారు. ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మసిస్ట్ లేకపోవడంతో రూ.లక్షల విలువైన ఎక్విప్‌మెంట్ ఉన్నా వ్యాధినిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. ప్రభుత్వం స్పందించి సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News September 11, 2025
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బదిలీ

సాధారణ బదిలీల్లో భాగంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కీర్తి చేకూరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీర్తి చేకూరి స్వస్థలం వైజాగ్, ఆమె ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్ చేశారు. గతంలో గుంటూరు నగర కమిషనర్‌గా, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా పనిచేశారు.
News September 11, 2025
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్‌గా రాజ బాబు

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజ బాబు నియమితులయ్యారు. ఏపీలోని పలు జిల్లాల కలెక్టర్‌లను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన తమీమ్ అన్సారియా తన మార్కు పాలన సాగించారు. పలు సమీక్షల ద్వారా అధికారులకు సూచనలు చేస్తూ జిల్లా అభివృద్ధిలో ఆమె తనదైన శైలిని ప్రదర్శించారు.
News September 11, 2025
NRPT: హ్యాండ్లూమ్ భవన్ నిర్మాణ పనుల పరిశీలించిన అధికారులు

దసరాలోపు హ్యాండ్లూమ్ ఎక్సలెన్స్ భవనం పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట పట్టణ శివారులో నిర్మిస్తున్న సెంటర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్ భవన నిర్మాణ పనులను గురువారం సందర్శించి రివ్యూ చేశారు. బ్యాలెన్స్ పనులు తొందరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీజీ ఎంఎస్ ఐడీసీ ఈఈ రతన్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.