News September 11, 2025
కామారెడ్డి: పరిషత్ పోరుకు ఓటర్ల లెక్క తేలింది..!

కామారెడ్డి జిల్లాలో పరిషత్ ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు 25 ZPTC, 233 MPTC స్థానాలకు తుది ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు బుధవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 6,39,730 మంది ఓటర్లతో పాటు 1,2590 పోలింగ్ స్టేషన్లను ప్రకటించారు. స్థానిక పోరుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.. ఎన్నికల తేదీలే ప్రకటించాల్సి ఉంది.
Similar News
News September 11, 2025
గోదావరిఖని: సీఐటీయూ బ్యాలెట్ ద్వారా అభిప్రాయాల సేకరణ

సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కావాలా.. క్వార్టర్ కావాలా అనే విషయంపై అభిప్రాయాలను సేకరించేందుకు CITU-SCEU ఆధ్వర్యంలో ఆర్జీ1 ఏరియాలో గురువారం ఓటింగ్ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. ఆర్జీ 1 ఏరియాలోని జీఎం ఆఫీస్, ఎస్‌అండ్‌పీసీ, జీడీకే 1, 2, 2ఏ, ఓసీపీ 5, వర్క్‌షాప్, ఎక్స్‌ప్లోరేషన్, సివిల్ విభాగాల్లో ఓటింగ్ చేపట్టారు. కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని అభిప్రాయాలను తెలిపారని నాయకులు
చెప్పారు.
News September 11, 2025
గోదావరిఖని: టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీగా కొయ్యడ మల్లేశ్

సింగరేణి ఆర్జీ-1 ఏరియాలో కోల్ ల్యాబ్ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్న కొయ్యడ మల్లేశ్ టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీగా నియమితులయ్యారు. టీబీజీకేఎస్ ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ వడ్డెపల్లి శంకర్ కొయ్యడ మల్లేశ్‌ను నియమిస్తూ గురువారం నియామకపు ఉత్తర్వులు అందజేశారు. తనను నియమించినందుకు కొయ్యడ మల్లేశ్ కృతజ్ఞతలు తెలిపారు. టీబీజీకేఎస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
News September 11, 2025
తాతయ్యగుంట గంగమ్మ సేవకులు వీరే:

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పాలకమండలిని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. సభ్యుల వివరాలు:
☞ మహేష్ యాదవ్ ☞ గుణ ☞ భాగ్యవల్లి ☞ రాజా రుద్ర కిషోర్
☞ వరలక్ష్మి ☞ విమల ☞ చంద్రశేఖర్ ☞ శ్యామల ☞ మధులత
☞ లక్ష్మణరావు.
☞ మొత్తం 41 మంది పేర్లు పరిశీలనకు వెళ్లాయి.
☞ వీరిలో మహేష్ యాదవ్ ఛైర్మన్‌గా నియామకం అయ్యే అవకాశం ఉంది.