News September 11, 2025
గంగారంలో అత్యధిక వర్షపాతం నమోదు

జిల్లాలో గురువారం ఉదయం 8.30 గం. వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గంగారం 65.5 మి.మీ, గార్ల 42.8, కొత్తగూడ 34.3, బయ్యారం 26.8, కురవి 20.5, మహబూబాబాద్ 18.8, గూడూరు 10.8, కేసముద్రం 4.3, డోర్నకల్ 3.0, నర్సింహులపేట 2.5, సీరోల్ 2.0, నెల్లికుదురు 1.3, ఇనుగుర్తి 1.0 చిన్నగూడూరు 0.8, తొర్రూర్ 0.8 మి.మీగా నమోదయింది.
Similar News
News March 16, 2026
విశాఖలో రోడ్డు ప్రమాదం.. తుని యువతి మృతి

విశాఖపట్నం BHPV వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందారు. స్కూటీపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో పార్వతీపురానికి చెందిన సీహెచ్ అనూష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తుని గవరపేటకు చెందిన ఆడారి కుసుమాంజలి మహాలక్ష్మి (19) చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. ఈ ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 16, 2026
సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్మెంట్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇతను కెరీర్‌లో 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20లు ఆడారు. 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 రన్స్ చేశారు. వికెట్ కీపర్‌గా 315 క్యాచ్‌లు పట్టారు. కెప్టెన్‌గా 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. U-19 సారథిగా 2006లో వరల్డ్ కప్ సాధించారు.
News March 16, 2026
‘మౌంటెడ్ స్ప్రేయర్’తో ఎరువుల పిచికారీ సులభం

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరికరాలు సాగులో రైతు శ్రమను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు ‘మౌంటెడ్ స్ప్రేయర్’ అనే పరికరాన్ని వాడుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు బిగించి ద్రవరూపంలో ఎరువులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రోజుకు 20 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు మొక్కలకు కూడా సమపాళ్లలో ఎరువులు, మందులను అందించవచ్చు.


