News September 11, 2025
జగిత్యాల జిల్లాలో 20 జడ్పీటీసీ, 216 ఎంపీటీసీ స్థానాలు

జగిత్యాల జిల్లాలో కొత్తగా ఏర్పడిన భీమారం, ఎండపల్లి మండలాలతో కలిపి మొత్తం 20 మండలాలకు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. గతంలో 18 ఎంపీపీ, 18 జడ్పీటీసీ స్థానాలుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 20కి చేరింది. పునర్వ్యవస్థీకరణ అనంతరం 214కు బదులుగా 216 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. మండలంలో కనీసం ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News March 3, 2026
ముఖ్యమంత్రి సదస్సులో కరీంనగర్ కలెక్టర్

హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. ప్రధానంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు.
News March 3, 2026
NGKL:మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన

రాష్ట్ర ప్రభుత్వం 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనుంది. ప్రణాళిక శాఖ నోడల్‌గా వ్యవహరిస్తూ గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఏప్రిల్ 2న గ్రామ సభలు, మే 22న జిల్లా స్థాయి కార్యక్రమాలు, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. శాఖల వారీగా 10 థీమ్‌లతో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించి పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగించనున్నారు.
News March 3, 2026
BREAKING: గన్నవరంలో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

గన్నవరం మండలం చిక్కవరంలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. హోలీ ఆడి చేతులు కడుగుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడటంతో మృతి చెందారు. మృతులు దుప్పల నవీన్ కుమార్ (11), వెంకట జోసఫ్ (16)గా గుర్తించారు. మరో విద్యార్థి సాయి (16) మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


