News September 11, 2025
నేపాల్‌లో చిక్కుకున్న గుమ్మలక్ష్మీపురం వాసులు!

గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందినవారు నేపాల్‌లో(ఖాట్మండు) జరుగుతున్న అల్లర్లలో చిక్కుకున్నారు. ఈమేరకు ఒడిశాకు చెందిన కొంతమందితో కలిసి గుమ్మలక్ష్మీపురం వాసులు వెంకటరావు, సంతోషిలక్ష్మి అలాగే కేదారిపురానికి చెందిన సుబ్బారావు నేపాల్ సందర్శనకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఓ హోటల్లో తలదాచుకున్నారని. అధికారుల స్పందించి వారిని క్షేమంగా తీసుకురావాలని బంధువులు కోరుతున్నారు.
Similar News
News March 26, 2026
గ్యాస్ సరఫరాపై అపోహలు సృష్టిస్తే చర్యలు: డీఎస్ఓ

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో LPG గ్యాస్ సరఫరాపై అసత్య ప్రచారాలు చేసి అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ ఉదయభాస్కర్ హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించవద్దన్నారు. వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏజెన్సీల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవన్నారు.
News March 26, 2026
BHPL: ముచ్చటగా మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ

ప్రజలు ఇబ్బందులు పడవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని మూడు నెలల కోటాను లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ నెలలో పంపిణీ చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి 18 కిలోల బియ్యం ఇస్తారు. భూపాలపల్లి జిల్లాలో 1,38,747 రేషన్ కార్డులు ఉన్నాయి. యూనిట్ కుటుంబ సభ్యులు 3,93,919 ఉండగా 76,54,566 కిలోల బియ్యం మంజూరు చేశారు.
News March 26, 2026
గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

AP: గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని స్కూళ్లు, కాలేజీల్లో 2026-27లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగించినట్లు సెక్రటరీ కృష్ణమోహన్ తెలిపారు. 5వ క్లాస్‌తోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన ఖాళీలు (APRS CAT-2026), ఇంటర్, డిగ్రీ మొదటి ఏడాది (APRJC & DC CET-2026) ప్రవేశాలకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. అర్హత గల అభ్యర్థులు <


