News September 11, 2025

సైబర్ మోసానికి గురైన కాకినాడ ఎంపీ

image

కాకినాడ ఎంపీ ఉదయశ్రీనివాస్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆయన ఫైనాన్స్ మేనేజర్‌కు 4 రోజుల క్రితం ఓ ఆగంతకుడు ఎంపీ డీపీతో ఉన్న వాట్సాప్ సందేశం పంపాడు. తాను కొత్త నంబర్ వాడుతున్నా, నగదు బదిలీ చేయాలని సూచిస్తే అది నిజమని నమ్మిన మేనేజర్ 11 విడతల్లో రూ.92 లక్షల బదిలీ చేశారు. దీనిని ఈనెల 8న ఎంపీ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఎక్కడ జరిగింది అన్నది బయటికి రాలేదు. ఇది నిజమేనని ఎంపీ పీఏ తెలిపారు.

Similar News

News March 10, 2026

Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్‌ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్‌ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.

News March 10, 2026

ఎల్ నినో.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: వీసీ

image

AP: ఈ ఏడాది ఏప్రిల్ వరకు ENSO(ఎల్ నినో+లా నినా) పరిస్థితులకు అవకాశం ఉందని ఎన్జీ రంగా వర్సిటీ వీసీ జయలక్ష్మీ దేవి వెల్లడించారు. జులై తర్వాత <<19250011>>ఎల్ నినోకు<<>> 60 శాతం ఛాన్స్ ఉందని తెలిపారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని సూచించారు. నష్టాలను నివారించడానికి వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలన్నారు.

News March 10, 2026

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం: ఇజ్రాయెల్

image

యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 1,900 మంది ఇరాన్ సైనికులు, కమాండర్లను చంపేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌నూ టార్గెట్ చేసే అంశాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. ఇక ఇరాన్, హెజ్బొల్లా దాడుల్లో ఇజ్రాయెల్‌లో 12 మంది పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించినట్లు తెలిపింది. గాయపడిన వారిలో 2,238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని, 91 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.