News September 11, 2025
ఉద్యాన తోటల్లో బోరాన్ లోప లక్షణాలు – నివారణ

బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు, చిగుళ్లు, మొగ్గ దెబ్బతింటాయి. పండ్లపై పగుళ్లు ఏర్పడి నీరు పట్టినట్లు ఉంటాయి. కొమ్మ చివర పెరుగుదల తగ్గి పక్క కొమ్మలు పెరిగి మొక్క గుబురుగా కనిపిస్తుంది. లేత ఆకుల ఈనెలు పసుపు రంగుకి మారతాయి. ముదురు ఆకుల ఈనెలు దళసరిగా, వంకర తిరిగి పగుళ్లనిస్తాయి. పిందెలు రాలి, కాయలో గింజలు ఏర్పడవు. లీటరు నీటికి 1గ్రా. బోరాక్స్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసి ఈ లోపం నివారించవచ్చు.
Similar News
News March 15, 2026
పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్

AP: పార్టీ చీఫ్ చంద్రబాబు <<19391495>>ఆదేశాలతో<<>> పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
News March 15, 2026
ఫింగర్ ప్రింట్‌లాగే టంగ్ ప్రింట్స్.. తెలుసా?

ప్రతి మనిషికి వేలిముద్రలు ఎలాగైతే వేర్వేరుగా ఉంటాయో నాలుక ముద్రలు (Tongue prints) కూడా అలాగే ఒకరితో ఒకరికి అస్సలు పోలి ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల నాలుక ఆకృతి, ఉపరితల నిర్మాణం ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కవలల విషయంలోనూ ఇవి భిన్నంగానే ఉంటాయి. ఫ్యూచర్‌లో ఇది అత్యంత నమ్మదగిన బయోమెట్రిక్ గుర్తింపుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 15, 2026
22న రైతు భరోసా నిధులు

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దిపేట(D) నర్మెట్టలో CM రేవంత్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు 20రోజుల తర్వాత రెండో విడత, APR నెలాఖరులోగా మూడో విడత నిధులు అందజేయనున్నారు. 3 విడతల్లో కలిపి రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ కానున్నాయి.


