News September 11, 2025

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: సీపీ

image

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం CP అంబర్ కిషోర్ ఝా సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. ఇరుపక్షాలు సామరస్యంగా రాజీపడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. పోలీసులు రాజీపడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News March 19, 2026

VJA: 2024కు ముందు రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు- చంద్రబాబు

image

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో AP ప్రభుత్వం ఉగాది వేడుకలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలు, విధ్వంసాలతో భయం గుప్పిట్లో ఉందన్నారు. 2024కు ముందు ప్రజలు ఆనందంగా పండగలు జరుపుకునే పరిస్థితి లేదన్నారు. అప్పటి పాలనలో అరాచకమే రాజ్యమేలిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి, సంతోషం కనిపిస్తుందని పేర్కొన్నారు.

News March 19, 2026

జనగాం: ఒప్పంద ఉద్యోగాల దరఖాస్తుకు రేపే లాస్ట్‌డేట్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనగణన-2026 విధుల కోసం ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (రూం నం.29)లో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 19, 2026

PNG.. జిల్లాల వారీగా ఈ కంపెనీల సర్వీసులు

image

ఏపీలోని అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో THINK GAS అనే కంపెనీ PNG సర్వీసును అందిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో IOCL, ఉభయగోదావరిలో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ, కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(BGL), కృష్ణాలో మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. HYDలో BGL, పలు జిల్లాల్లో IOCL సర్వీసులు ఉన్నాయి.