News September 11, 2025

RGM: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

image

ఈనెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. రాజీ పడితే ఇరువర్గాలు గెలిచినట్లేనని సూచించారు. కక్షలు, కార్పన్యాలతో ఏమీ సాధించలేమన్నారు. కోర్టు విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలను కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.

Similar News

News March 12, 2026

పెద్దపల్లి: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

image

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పదకొండవ రోజు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. గురువారం నిర్వహించిన కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు మొత్తం 4,999 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,845 మంది పరీక్ష రాశారు. 154 మంది గైర్హాజరు కాగా 96 శాతం హాజరు నమోదైనట్లు ఆమె వెల్లడించారు. పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా జరిగాయని తెలిపారు.

News March 12, 2026

జగిత్యాల: ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు జమ

image

జగిత్యాల జిల్లాలో 2024-25 సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు నేరుగా వారి ఖాతాలలో జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలోని 1,267 మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.1,95,93,935 జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా కింద నిధులు విడుదల చేసిందన్నారు.

News March 12, 2026

దేశం సంక్షోభంలో.. మోదీ టూర్‌లో: ఖర్గే

image

దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ తరుణంలో PM మోదీ ఎన్నికల టూర్ చేపడుతున్నారని విమర్శించారు. ‘దేశవ్యాప్తంగా LPG కొరత ఉంది. ప్రజలు క్యూలైన్లలో నిలబడుతున్నారు. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం దగ్గర మాత్రం సమాధానం లేదు. దౌత్యపరంగా విఫలమవడం చాలా తీవ్రమైన అంశం. ఎనర్జీ మిస్‌మేనేజ్‌మెంట్‌ ఫలితాన్ని 140 కోట్ల మంది అనుభవిస్తున్నారు’ అని ఖర్గే పోస్ట్ చేశారు.