News September 11, 2025

మహాలయ పక్షంలో పాటించాల్సిన నియమాలు

image

<<17645864>>మహాలయ పక్షాల్లో<<>> శుభకార్యాలు చేయొద్దని పండితులు చెబుతున్నారు. ఇవి పితృదేవతలను స్మరించుకోవడానికి కేటాయించిన రోజులని అంటున్నారు. ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. * ఒంటిపూట భోజనం, భూశయనం చేయాలి. * మద్యమాంసాలు ముట్టుకోవద్దు. బ్రహ్మచర్యం పాటించాలి. * జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. * కాకులకు ఆహారం ఇవ్వాలి. * పేదలకు వస్త్రదానం చేయాలి. * బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి.

Similar News

News March 18, 2026

చక్రం తిప్పుతున్న త్రిష?

image

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హీరోయిన్ <<19317674>>త్రిష<<>> చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ TVK పార్టీ NDAతో పొత్తు నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందని వార్తలొస్తున్నాయి. ఇటీవల అమిత్ షాతోనూ త్రిష భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే TN రాజకీయాల్లో సంచలనాలు తప్పేలా కనిపించడంలేదు. మరోవైపు AIADMK నేతలూ త్రిష‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. TVK,BJP,AIADMK కలిసి DMKను ఢీ కొట్టనున్నాయా?

News March 18, 2026

కార్డియో VS యోగా VS స్ట్రెంత్ ట్రైనింగ్‌.. పొట్ట తగ్గడానికి ఏది బెస్ట్?

image

ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడంలో కార్డియో టాప్ అయితే, విశ్రాంతి సమయంలోనూ క్యాలరీలు ఖర్చయ్యేలా మెటబాలిజం పెంచడానికి స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరం. ఇక యోగా క్యాలరీలు తక్కువగా ఖర్చు చేసినా స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి పొట్ట దగ్గర కొవ్వు చేరకుండా చూస్తుంది. వీటన్నింటి కాంబినేషన్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. వీటితో పాటు ప్రొటీన్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవాలని అంటున్నారు.

News March 18, 2026

ట్రంప్‌ను లేపేస్తానన్నాడు.. అతడినే లేపేశారు!

image

యుద్ధంలో ఇరాన్ మరో కీలక నేతను కోల్పోయింది. ఆ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీని చంపేశామన్న ఇజ్రాయెల్ <<19410383>>ప్రకటనను <<>>ఇరాన్ తాజాగా ధ్రువీకరించింది. శత్రుదేశం దాడిలో లారిజనీతో పాటు అతడి కొడుకు, సెక్యూరిటీ సిబ్బంది మరణించినట్లు పేర్కొంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అలీ లారిజనీ US, ఇజ్రాయెల్‌కు వార్నింగ్స్‌ ఇస్తూ వచ్చారు. ట్రంప్‌ను వదిలేదే లేదని, ఆయనను లేపేస్తామంటూ హెచ్చరించారు. ఇంతలో ఆయనే హతమయ్యారు.