News September 11, 2025
ఇంటి గడపను పవిత్రంగా ఎందుకు పరిగణిస్తారు?

మన గృహానికి ఉండే ద్వారానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ద్వారం పైభాగంలో ఉన్న కమ్మిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే దానికి మామిడి తోరణం కడతారు. ద్వారం దిగువన ఉన్న గడప కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే దానికి పసుపు రాస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. గడపకు పసుపు పూయడం వల్ల క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయన్నది మరో కారణం.
Similar News
News September 11, 2025
తెలుగు రాష్ట్రాల్లో కోటీశ్వరులు ఎందరంటే?

గతేడాది ట్యాక్స్ రిటర్న్స్ డేటా ప్రకారం రూ.కోటి అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. మన దేశంలో అధికంగా మహారాష్ట్రలో 1,24,800 మంది కోటీశ్వరులున్నారు. ఆ తర్వాత యూపీలో 24,050, మధ్యప్రదేశ్‌లో 8,666, తమిళనాడులో 6,288 మంది ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 5,340, తెలంగాణలో 1,260 మంది ఉండటం గమనార్హం. ఇక లద్దాక్‌లో ముగ్గురు, లక్షద్వీప్‌లో ఒకరు మాత్రమే ఉన్నారు.
News September 11, 2025
పలు జిల్లాల కలెక్టర్లు బదిలీలు

AP: రాష్ట్ర ప్రభుత్వం 12జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఆయా జిల్లాలకు బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు..
* మన్యం- ప్రభాకర్ రెడ్డి, * విజయనగరం- రామసుందర్ రెడ్డి
* తూ.గో.- కీర్తి చేకూరు, * గుంటూరు- తమీమ్ అన్సారియా
* పల్నాడు- కృతిక శుక్లా, * బాపట్ల- వినోద్ కుమార్
* ప్రకాశం- రాజాబాబు, * నెల్లూరు- హిమాన్షు శుక్లా
* అన్నమయ్య- నిషాంత్ కుమార్, * కర్నూలు- ఎ.సిరి
* అనంతపురం- ఆనంద్, * సత్యసాయి- శ్యామ్ ప్రసాద్
News September 11, 2025
భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గరియాబాద్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం. అటు మావోల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.