News September 11, 2025
అటవీ సంరక్షణలో ఫారెస్ట్ పోలీసుల పాత్ర కీలకం: మంత్రి

రాష్ట్ర పోలీసులకు లభించే ప్రయోజనాలన్నీ అటవీ పోలీసులకు కూడా అందేలా చూస్తానని మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా HYDలోని నెహ్రూ జూ పార్కులో గల స్మారక చిహ్నం వద్ద ఆమె పోలీసు, అటవీ ఉన్నతాధికారులతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. అటవీ సంరక్షణలో ఫారెస్ట్ పోలీసుల పాత్ర కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అటవీ అమరవీరులకు అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.
Similar News
News March 20, 2026
CRDA కొత్త కమిషనర్‌గా విజయరామరాజు

AP: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో CRDA కమిషనర్‌గా విజయరామరాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత, పోలవరం కలెక్టర్‌గా దినేశ్ కుమార్ నియమితులయ్యారు.
News March 20, 2026
బాపట్ల: జాతీయ శిక్షణ శిబిరానికి నలుగురి ఎంపిక

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జూనియర్ రెడ్ క్రాస్ జాతీయ శిక్షణ శిబిరానికి బాపట్ల జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో మార్చి 25 నుంచి 29 వరకు జరిగే శిబిరంలో వారు పాల్గొననున్నారు. రాష్ట్ర బృందానికి జిల్లాకు చెందిన పిన్నిబోయిన శ్రీమన్నారాయణ సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఎంపికైన విద్యార్థులను కలెక్టర్ వినోద్ కుమార్ అభినందించారు.
News March 20, 2026
ఏర్పేడు: అప్రెంటిస్ పోస్టులకు ఇంటర్వ్యూలు

IIT తిరుపతిలో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) ద్వారా గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. డిగ్రీ-16, డిప్లొమా-14 మొత్తం 40 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. 27, 28, 29 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయని, వివరాలకు https://www.iittp.ac.in/Interns_and_Apprentice వెబ్ సైట్ చూడాలని అధికారులు కోరారు.


