News April 4, 2024
విశాఖ: నర్సింగ్ కాలేజీలో వేధింపులపై CMOకి ఫిర్యాదు

కింగ్‌జార్జి ఆస్పత్రిలోని నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్‌తో పాటు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఓ విద్యార్థిని CMOకి ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. కేజీహెచ్ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న తనను కాలేజీలో ర్యాగింగ్ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది కూడా ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది.
Similar News
News January 12, 2026
విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. విశాఖ నూతన జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి రానున్నారు. ఆమె గతంలో చిత్తూరు జిల్లా జేసీగా పనిచేశారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
News January 12, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్‌ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.