News September 11, 2025

రేషన్‌లో సన్నబియ్యం.. తగ్గిన రేట్లు!

image

TG: ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత సన్నబియ్యం పంపిణీతో మార్కెట్లో సన్నాల రేట్లు తగ్గినట్లు తెలుస్తోంది. గత 3, 4 నెలల నుంచి పేద, మధ్యతరగతి వారు బియ్యం కొనుగోళ్లు గణనీయంగా తగ్గించారు. డిమాండ్ లేకపోవడంతో రేట్లు కూడా పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. క్వింటాలుకు రూ.వెయ్యి వరకు తగ్గినట్లు అంచనా. గతంలో క్వింటా బియ్యం సంచి రూ.5-6వేలు వరకు ఉండగా ఇప్పుడు అది రూ.4-5వేలకు దిగొచ్చింది.

Similar News

News March 5, 2026

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర మరోసారి తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.1,630 తగ్గి రూ.1,62,880కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,500 పతనమై రూ. 1,49,300 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీటి ధరల్లో కాస్త మార్పులుండొచ్చు.

News March 5, 2026

ఎక్కువ చదివినవారిలోనే నిరుద్యోగులు అధికం!

image

ఇండియాలో చదువు పెరిగే కొద్దీ నిరుద్యోగం కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ నిరుద్యోగ సగటు 3.2% ఉంటే డిగ్రీ చదివిన వారిలో ఇది 13%గా ఉంది. దీనిని ‘ఎడ్యుకేషన్ పారడాక్స్’ అంటారు. తక్కువ చదువుకున్న వారు ఏదో ఒక చిన్న పనిలో త్వరగా చేరుతుండగా.. పట్టభద్రులకు వారి స్థాయికి తగ్గ ఉద్యోగాలు దొరకట్లేదు. డిగ్రీలున్నా నైపుణ్యాలు లేకపోవడం& ఉద్యోగాల కొరతే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

News March 5, 2026

ఖలిస్థానీ విమర్శకురాలు, యూట్యూబర్ దారుణ హత్య

image

ఖలిస్థానీ విమర్శకురాలు, పంజాబ్ సంతతికి చెందిన యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్(45) కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. SMలో యాక్టివ్‌గా ఉండే నాన్సీ ఖలిస్థానీ కార్యకలాపాలను విమర్శిస్తూ వీడియోలు పోస్టు చేసేవారు. తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కామెంట్లనూ ఖండించేవారు. ఆమె హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.