News September 11, 2025
వర్షాల్లోనూ మేకప్ చెదిరిపోదు..!

అమ్మాయిలు ఎంతో కష్టపడి వేసుకున్న మేకప్‌ని ఈకాలంలో వర్షం తుడిచేస్తుంటుంది. ఇలా వర్షాల్లో మేకప్ పోకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. వర్షాకాలంలో నార్మల్ మాయిశ్చరైజర్స్ కంటే వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ బెటర్. అలాగే క్రీమ్స్, ఫౌండేషన్ వాటర్ బేస్డ్ వాడటం మంచిది. వీటితో పాటు వాటర్ రెసిస్టెంట్ మస్కారా, లిక్విడ్ ఫౌండేషన్‌లో పౌడర్ కలిపి మేకప్ వేసుకోండి. ఇలా చేస్తే వర్షంలో తడిచినా మేకప్ పోదు.
Similar News
News March 14, 2026
హాస్టళ్లలో కట్టెల పొయ్యిలపై వంట.. ఐటీ కారిడార్‌లో పొగ

TG: హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ల కొరతతో చాలా వరకు హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్‌లో బిల్డింగుల మధ్య నుంచి పొగ వ్యాపిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పటికే చాలా పీజీలు, హాస్టళ్లలో టిఫిన్లు ఆపేశారు. తక్కువ గ్యాస్ వినియోగంతో పూర్తయ్యే వంటలే చేస్తున్నారు.
News March 14, 2026
ఒక్క రోజులో 1.34లక్షల ఇండక్షన్ స్టవ్స్ విక్రయం

దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా నెలకు 1.80 లక్షల అమ్మకాలు జరిగే చోట ఒక్క రోజే అమెజాన్‌లో 1.34 లక్షలకు పైగా స్టవ్‌లు అమ్ముడయ్యాయి. ఈ అనూహ్య డిమాండ్‌ను కంపెనీలు సైతం ఊహించకపోవడంతో చాలాచోట్ల ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News March 14, 2026
SIDBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) 3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, CA, CFA, MBA, PGDM అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 18 వరకు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in


