News September 11, 2025

ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు: ఎస్సై యుగంధర్ రెడ్డి

image

బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన ఘటన పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై యుగంధర్ రెడ్డి వివరాల ప్రకారం.. పెబ్బేరుకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, అదే మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అబ్బాయిపై పోక్సో కేసు నమోదైంది.

Similar News

News March 14, 2026

నాగర్‌కర్నూల్: ప్రభుత్వంపై పోరాటం చేస్తాం: నాగం

image

రైతులకు సాగునీరు,తాగునీరు అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలుతీసుకోవాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెండింగ్‌లో ఉన్న సుమారు మూడు కిలోమీటర్ల పనులను పూర్తి చేయకుంటే తన వయస్సును కూడా లెక్కచేయకుండా ప్రాజెక్టుల దగ్గర పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

News March 14, 2026

రామన్నపేట: మార్చి 28 జాతీయ లోక్ అదాలత్

image

మారుమూల ప్రజలకు న్యాయం అందేలా వివిధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రధాన జడ్జి A.జయరాజు రామన్నపేట కోర్టులో మార్చి 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు పరిష్కరించే విధానాలపై DLSA కార్యదర్శి V.మాధవిలత, రామన్నపేట Sr సివిల్ జడ్జి G.సబిత, ప్రిన్సిపల్ Jr సివిల్ జడ్జి S.శిరీష, 2nd క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి D.సత్తయ్యతో కలిసి చర్చించారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 14, 2026

పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.