News September 11, 2025

స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే..

image

ప్రెగ్నెన్సీలో చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడతాయి. వీటిని తగ్గించడానికి యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు, జింక్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఆలివ్ఆయిల్ మసాజ్, యాంటీఆక్సిడెంట్ క్రీములు రాస్తే వీటి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. ప్రసవం తర్వాత రెటినాల్, కొలాజిన్,జోజోబా ఆయిల్, కోకో బటర్, విటమిన్ ఇ, గ్లైకాలిక్ యాసిడ్ క్రీములు వాడాలి. వీటితోపాటు మైక్రోడెర్మాబ్రేషన్ చేయించుకోవచ్చు.

Similar News

News March 22, 2026

కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

image

పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో ఖతర్‌కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడని అధికారులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసేందుకు, మిస్సింగ్ పర్సన్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని పేర్కొన్నారు.

News March 22, 2026

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. 15minలో మెసేజ్ డిలీట్!

image

వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ రానుంది. దీనిని యూజర్లు ఎనేబుల్ చేసుకుంటే చాట్ లోని మెసేజ్‌లు వాటికవే డిలీట్ అవుతాయి. మెసేజ్ ఓపెన్ చేసిన టైమ్ నుంచి 15min కౌంట్ డౌన్ మొదలవుతుంది. అది పూర్తవగానే సెండర్, రిసీవర్ చాట్‌లో మెసేజ్ మాయమవుతుంది. ఓపెన్ చేయని మెసేజ్‌లు 24hrs వరకూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది. OTP, పాస్‌వర్డ్స్ వంటి వివరాలు షేర్ చేసే వారికి ఇది ఉపయోగపడొచ్చు.

News March 22, 2026

SRH 250 స్కోర్ చేసినా లాభం లేదు: ఆకాశ్ చోప్రా

image

IPL-2026లో SRH జట్టు 250 రన్స్ చేసినా లాభం లేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఆ జట్టులో బ్యాటర్లు 250 పరుగులు చేస్తే బౌలర్లు కూడా 250 పరుగులు సమర్పించుకుంటారని పేర్కొన్నారు. అంత బలహీనంగా ఆ జట్టు బౌలింగ్ ఉందని అన్నారు. ‘కమిన్స్, ఎషాన్ మలింగా అందుబాటులో లేకపోవడంతో బ్రైడన్ కార్స్‌ను ఆడించాల్సి వస్తుంది. ఇండియన్ బౌలర్లతో మేనేజ్ చేయడమూ సవాలే’ అని పేర్కొన్నారు.