News September 11, 2025

HYD: ఇక ర్యాపిడోలో లేడీ రైడర్లు!

image

నగరంలో ర్యాపిడో మహిళా రైడర్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి స్కీం సభ్యులుగా ఉన్న మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు డీపీఓ ఆశా విరానిక తెలిపారు. బైక్ కొనుగోలు కూడా సర్కారే చేయూతనందిస్తుందని. కేవలం 10 శాతం చెల్లిస్తే మిగతా మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని త్వరలో సీఎం ప్రారంభిస్తారని DPO వెల్లడించారు.

Similar News

News March 12, 2026

ఇదే కొనసాగితే హైదరాబాద్‌‌లో బంద్!

image

నగరాన్ని గ్యాస్ కొరత కలవరపెడుతోంది. CNG స్టేషన్ల వద్ద బారులు తీరిన ఆటోలు, చర్లపల్లి గ్యాస్ ప్లాంట్ వద్ద నిలిచిన లారీలు, పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఖాళీ కుర్చీలు, స్టోర్‌లలో నిండుకుంటున్న ఇండక్షన్ స్టౌవ్‌లు, ప్రజల ముఖంలో దిగులు ఇవి HYDలో కనపడుతున్న దృశ్యాలు. గ్యాస్ సరఫరాలో ఇబ్బంది కొనసాగితే ‘HYD బంద్’ అయ్యి జనజీవనం స్తంభించడం, కడుపుమండటం, ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News March 12, 2026

HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

image

HHF-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ఆనందిమా కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ AI కిట్‌తో BP, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడునూ నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు. గర్భిణుల పాలిట AI వరంగా నలిచింది.

News March 12, 2026

HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

image

హెచ్‌హెచ్‌ఎఫ్-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ‘ఆనందిమా’ కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ ఏఐ కిట్‌తో బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడును కూడా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI వెంటనే హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు.