News September 11, 2025

కృష్ణా: ప్రారంభమైన జెడ్పీ సర్వసభ్య సమావేశం

image

కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్‌తోపాటు మూడు జిల్లాల అధికారులు హాజరయ్యారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభమైంది.

Similar News

News March 14, 2026

కృష్ణా: విధుల పట్ల నిర్లక్ష్యం.. సస్పెండ్, షోకాజ్ నోటీసులు

image

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కృష్ణా జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు చేపట్టారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డోకిపర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్–2) రజియా సుల్తానాను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా జనాభా లెక్కల శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని వడ్లమన్నాడు సచివాలయ డేటా అసిస్టెంట్ కె. సురేంద్రకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

News March 13, 2026

గన్నవరం: మంచుతో విమాన రాకపోకలకు అంతరాయం

image

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో విమానాల రాకపోకలు అంతరాయం కలిగాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సిన విమానాలు కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. పరిస్థితి మెరుగుపడిన తర్వాతే విమానాల ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించారు.

News March 13, 2026

కృష్ణాజిల్లాలో రేపు సెలవు రద్దు

image

కృష్ణా జిల్లాలోని విద్యా సంస్థలకు ఈ నెల 14న రెండో శనివారం శెలవు రద్దు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు గురువారం తెలిపారు. మొంథా తుపాన్ సమయంలో కాంపస్ శాటరీ శెలవుల దృష్ట్యా ఈ శనివారం పాఠశాలలకు శెలవు దినం రద్దు చేసినట్లు వివరించారు. ఆ రోజు అన్ని విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని డీఈఓ కోరారు.