News September 11, 2025

వార్డ్‌రోబ్ నుంచి వాసన వస్తోందా?

image

వర్షాకాలంలో దుస్తులు ఆరడం పెద్ద సమస్య. ఆరడానికి చాలాసమయం పట్టడంతో పాటు, అదోరకమైన వాసన వస్తుంది. ఇలాకాకుండా ఉండాలంటే దళసరి, పల్చటి బట్టలను వేర్వేరుగా ఉతికి, ఆరేయాలి. నానబెట్టే ముందు సర్ఫ్‌లో కాస్త బేకింగ్ సోడా, నిమ్మరసం కలపాలి. సువాసన కోసం కండీషనర్స్ బదులు రోజ్ వాటర్ కలిపిన నీటితో జాడించి ఆరేయాలి. వార్డ్‌రోబ్‌లో రోజ్మెరీ, నాఫ్తలీన్ బాల్స్, సిలికాజెల్ ప్యాకెట్స్ పెడితే దుర్వాసన రాకుండా ఉంటుంది.

Similar News

News September 11, 2025

తెలుగు రాష్ట్రాల్లో కోటీశ్వరులు ఎందరంటే?

image

గతేడాది ట్యాక్స్ రిటర్న్స్ డేటా ప్రకారం రూ.కోటి అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. మన దేశంలో అధికంగా మహారాష్ట్రలో 1,24,800 మంది కోటీశ్వరులున్నారు. ఆ తర్వాత యూపీలో 24,050, మధ్యప్రదేశ్‌లో 8,666, తమిళనాడులో 6,288 మంది ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 5,340, తెలంగాణలో 1,260 మంది ఉండటం గమనార్హం. ఇక లద్దాక్‌లో ముగ్గురు, లక్షద్వీప్‌లో ఒకరు మాత్రమే ఉన్నారు.

News September 11, 2025

పలు జిల్లాల కలెక్టర్లు బదిలీలు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం 12జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఆయా జిల్లాలకు బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు..
* మన్యం- ప్రభాకర్ రెడ్డి, * విజయనగరం- రామసుందర్ రెడ్డి
* తూ.గో.- కీర్తి చేకూరు, * గుంటూరు- తమీమ్ అన్సారియా
* పల్నాడు- కృతిక శుక్లా, * బాపట్ల- వినోద్ కుమార్
* ప్రకాశం- రాజాబాబు, * నెల్లూరు- హిమాన్షు శుక్లా
* అన్నమయ్య- నిషాంత్ కుమార్, * కర్నూలు- ఎ.సిరి
* అనంతపురం- ఆనంద్, * సత్యసాయి- శ్యామ్ ప్రసాద్

News September 11, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గరియాబాద్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం. అటు మావోల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.