News September 11, 2025

HYD:తెలుగు వర్శిటీ.. నేటి నుంచి బస్ సౌకర్యం

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణానికి TGSRTC బస్ సౌకర్యం కల్పించారు. రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో మాట్లాడారు. నేటి నుంచి బస్ సౌకర్యం ప్రారంభించామని చెప్పారు. ఉదయం 9.45కు నిజాంపేట్ నుంచి విశ్వవిద్యాలయానికి, సాయంత్రం 4.30కు విశ్వవిద్యాలయం నుంచి నిజాంపేటకు నడుపుతున్నట్లు తెలిపారు. వర్శిటీ ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 20, 2026

నగరాభివృద్ధికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

కర్నూలు నగరాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్‌ను ప్రారంభించారు. కమిషనర్ పి.విశ్వనాథ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నగర పరిపాలనలో సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం తన కార్యాలయంలో కేఎంసి పూర్తి మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

News March 20, 2026

SVU: రేపటి డిగ్రీ పరీక్ష వాయిదా

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(UG) ఇయర్ ప్యాటర్న్ అభ్యర్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా శనివారం జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు పరీక్ష విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ జరగనుందన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News March 20, 2026

నెల్లూరు: గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు

image

నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడు మైనార్టీ బాలురు గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.