News September 11, 2025
తిరుపతి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తిరుపతి రూరల్ తుమ్మలగుంట రోడ్డు తుడా ఆఫీస్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చిత్తూరు టౌన్ చామంతి పురానికి చెందిన కొమరవెల్లి కార్తీక్ (26) బైక్‌పై అతివేగంతో వెళ్లి డివైడర్‌ను ఢీకొని మృతి చెందినట్లు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చిన్ని గోవిందు తెలిపారు. మృతుడి తల్లి కె.సుధ ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 4, 2026
రాజమండ్రి: అపార్ట్‌మెంట్‌లో వివాహిత ఆత్మహత్య

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు పరిధిలోని హుగ్గం పేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న GVK Signature 202 అపార్ట్‌మెంట్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు, అనుమానమే ఈ ప్రాణం తీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2026
పంచాయతీల్లో ‘పంచాయితీ’!

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.
News March 4, 2026
విజయవాడ IAS భార్య మృతి అప్డేట్ ఇదే..!

సీనియర్ IAS అధికారి GC కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక మృతి అనుమానాస్పదం కాదని సహజ మరణమేనని ధ్రువీకరిస్తూ కేసును క్లోజ్ చేశారు. 2026 జనవరి 4న సత్య దీపిక మృతి చెందారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర దర్యాప్తు ఆధారంగా సత్యదీపిక మృతి అనుమానాస్పదం కాదని సహజ మరణమే అని తేల్చారు. దీంతో ఆయా శాఖలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసును అధికారికంగా మంగళవారం క్లోజ్ చేశారు.


