News September 11, 2025
సంగారెడ్డి: NMMS స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్(NMMS) ఉపకార వేతనాలకు 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. అక్టోబర్ 6వ తేదీ వరకు www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు మాత్రమే ఈ ఉపకార వేతనాలకు అర్హులని పేర్కొన్నారు.
Similar News
News March 20, 2026
రెండు వారాల్లో వీటన్నింటి ధరలు పెరిగాయ్: కాంగ్రెస్

ప్రధాని మోదీ హయాంలో దేశంలో అన్ని ధరలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గత రెండు వారాల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.146, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60, రిఫైన్డ్ ఆయిల్ రూ.30/L, పామ్ ఆయిల్ రూ.15/L, ఇండస్ట్రియల్ డీజిల్ రూ.22/L, ప్రీమియం పెట్రోల్ రూ.2.35/L, జొమాటో డెలివరీ ఫీ రూ.2.40, విమాన టికెట్లు రూ.425-2,300, ప్లాస్టిక్ బాటిల్ సెట్ రూ.40, ఇండక్షన్ స్టవ్ ధర 40% పెరిగిందని పేర్కొంది.
News March 20, 2026
గ్యాస్ పొదుపుగా వాడుకోవాలి: VZM కలెక్టర్

జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, డిమాండ్‌కు సరిపడా సరఫరా జరుగుతోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన VC అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేయకుండా, పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్-సప్లై అంతరాన్ని తగ్గించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు.
News March 20, 2026
300 గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సైట్లు బ్యాన్

చట్టవిరుద్ధమైన గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఏకంగా అలాంటి 300 సైట్లు, యాప్‌లను నిషేధించింది. వాటిలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్, ఆన్‌లైన్ కేసినో ఆఫరింగ్ స్లాట్స్, లైవ్ డీలర్ టేబుల్స్, p-2-p బెట్టింగ్, రియల్ మనీ కార్డ్, సట్టా/మట్కా గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్స్ ఉన్నాయి. మొత్తం 8,400 ఇల్లీగల్ సైట్లు ఉండగా కేంద్రం ఇప్పటివరకు 4,900 సైట్లను బ్లాక్ చేసింది.


