News September 11, 2025
శిథిలావస్థ గదుల్లో తరగతులు నిర్వహించవద్దు: డీఈఓ

జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో విద్యార్థులకు బోధన నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలల్లో ప్రమాదకరంగా ఉన్న గదుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు తప్పక గమనించాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రధానమని, ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.
Similar News
News March 11, 2026
చిత్తూరు: మల్చింగ్ పేపర్ ధరకు రెక్కలు

చిత్తూరు జిల్లాలో పలువురు రైతులు మల్చింగ్ పేపర్‌తో సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. టమాటా సాగులోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో ముడి సరుకుల ధర పెరగడంతో మల్చింగ్ ధరకు రెక్కలు వచ్చాయి. గతేడాది ఓ రోల్ రూ.2300 ఉండగా ప్రస్తుతం రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
News March 11, 2026
పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగు – ఎన్నో లాభాలు

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.
News March 11, 2026
ఈనెల 13న అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 13వ తేదీన అల్లూరి జిల్లాలో పర్యటించనునట్లు సమాచారం. ఈ మేరకు పాడేరు మండలం నందిగురువులో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఉప ముఖ్యమంత్రి పర్యటన ఇంకా ఖరారు కావాల్సి ఉండగా, పర్యటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే కార్యక్రమంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.


