News September 11, 2025

సంగారెడ్డి: ఇంటర్ అడ్మిషన్లకు రెండు రోజులు అవకాశం

image

ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం రెండు రోజులు అవకాశం కల్పించినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం గురువారం తెలిపారు. ఈనెల 12 వరకు ఇంటర్లో చేరేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలలో రూ. 500 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2026

PDPL: సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలి: ఎంపీ

image

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్‌పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News March 18, 2026

నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

image

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.

News March 18, 2026

తిరుపతిలో దొంగల ముఠా అరెస్ట్