News September 11, 2025
ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు: ఎస్సై యుగంధర్ రెడ్డి

బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన ఘటన పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై యుగంధర్ రెడ్డి వివరాల ప్రకారం.. పెబ్బేరుకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, అదే మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అబ్బాయిపై పోక్సో కేసు నమోదైంది.
Similar News
News March 13, 2026
అయిజ: సీతారాముల తలంబ్రాలు బుక్ చేసుకోండి

భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణంలో ఉపయోగించిన తలంబ్రాలు పొందేందుకు పోస్టల్ శాఖ ద్వారా బుక్ చేసుకోవాలని అయిజ సబ్ పోస్ట్ మాస్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోస్ట్ ఆఫీస్‌లో ప్రజల నుంచి బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. రూ.151 తో ముత్యాల తలంబ్రాలు, రూ.450 తో అంతరాలయ అర్చన తలంబ్రాలు పొందే వీలుందన్నారు. భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 13, 2026
పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించారా?

TG: ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా వేస్తున్నారు. పాడి రైతులు నిర్లక్ష్యం చేయకుండా జీవాలకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని, ఏమైనా సందేహాలుంటే సమీపంలోని వెటర్నరీ డాక్టర్లను సంప్రందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.
News March 13, 2026
సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

TG: సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. టికెట్ రేట్లు పెంచుతున్నట్లు సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.


