News September 11, 2025

నిజామాబాద్: కుక్కర్ పేలి మధ్యాహ్న భోజన కార్మికురాలికి గాయాలు

image

అమ్రాద్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు లలితకు తీవ్రగాయాలు అయ్యాయి. స్కూల్లో వంట చేస్తున్న సమయంలో కుక్కర్ పేలింది. దీంతో ఆమెను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌తో చర్చించారు.

Similar News

News March 10, 2026

NZB: రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్..!

image

నిజామాబాద్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం సహనం, సోదరభావానికి ప్రతీక ఆన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. పేద ముస్లింలు పండగను సంతోషంగా జరుపుకోవాలని రంజాన్ తోఫా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News March 10, 2026

NZB: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

image

NZB జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరగకూడదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక జారీ చేశారు. ఇసుకను అక్రమంగా తవ్వకం లేదా రవాణా చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలో ఇసుక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన ఇసుక వాహనం ఇసుక ఆన్లైన్ యాప్ ద్వారానే అనుమతులు తీసుకొని రవాణా చేసుకోవాలని సూచించారు.

News March 10, 2026

NZB: ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది: TPCC చీఫ్

image

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం నగరంలోని ఖిలా రోడ్‌లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మైనారిటీల కోసం విద్య, ఉపాధి రంగాల్లో అనేక పథకాలను, షాదీ ముబారక్’ పథకాన్ని పకడ్బందీగా అమల చేస్తోందన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.