News September 11, 2025
ఖమ్మం: KU పీజీ ఫలితాలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ వివిధ పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏ(పొలిటికల్ సైన్స్) 4వ సెమిస్టర్ మే, ఎంఏ(ఎంసీజే) మొదటి సెమిస్టర్ ఏప్రిల్, ఎంఎస్సీ(ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్ జూన్, ఎంఏ(ఇంగ్లిష్) మొదటి సెమిస్టర్ మార్చి-2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాలను www.kuexams.org యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News March 11, 2026
KUకి CPGET-2026 నిర్వహణ బాధ్యతలు

రాష్ట్రంలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక CPGET-2026 పరీక్షల నిర్వహణ బాధ్యతలు వరంగల్‌లోని కేయూకు దక్కాయి. గత కొన్నేళ్లుగా ఈ పరీక్షలను హైదరాబాద్ OU నిర్వహిస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేసి బాధ్యతలను కేయూకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించనున్నారు.
News March 11, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.930 పెరిగి రూ.1,63,310కు చేరింది. నిన్నటి నుంచి రూ.1,630 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.850 ఎగబాకి రూ.1,49,700 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.3,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 11, 2026
మెదక్: బాలికపై యువకుడి అసభ్య ప్రవర్తన

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. శివంపేట మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గ్రామంలో జరుగుతున్న సర్కస్‌ను చూడడానికి వెళ్లగా అక్కడే ఉన్న 20 ఏళ్ల యువకుడు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సోకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


