News September 11, 2025
కేయూ మొదటి గేటు ఎదుట BRSV ధర్నా

గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, వెంటనే పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Similar News
News March 12, 2026
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా జరపాలి: AISF

భద్రాద్రి జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించాలని కోరారు. వేలాది మంది భవిష్యత్తు దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News March 12, 2026
సీఎం కలెక్టర్ల సదస్సులో బాపట్ల కలెక్టర్

బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల 2వ రోజు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా ప్రగతి, అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ సీఎంకి వివరించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News March 12, 2026
గ్యాస్ సిలిండర్ల కోసం కంగారు వద్దు: జేసీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ కొరత ఉండదని జేసీ నిశాంతి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక చర్యల మూలంగా గృహ వినియోగదారులకు యథావిధిగా సరఫరా కొనసాగుతుందని తెలిపారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద అధికారులతో నిర్వహించిన సమావేశంలో గ్యాస్ సరఫరాపై పలు సూచనలు చేశారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.


