News September 11, 2025
నెల్లూరు: ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 5.58 లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 5.58 లక్షలు స్వాహ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నెల్లూరులోని చిన్నబజార్ పోలీసులుకు ఫిర్యాదు అందింది. ఉద్యోగ వేటలో ఉన్న మూలపేటకు చెందిన ఓ యువకుడు ఫోన్లో పరిచయమైన ఓ యువతి చెప్పిన మాటలకు లోబడి ఆమె ఖాతాకు రూ.5.58 లక్షలను బదిలీ చేశాడు. తర్వాత ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
Similar News
News March 12, 2026
నెల్లూరు కలెక్టర్‌పై CM ప్రశంసలు

జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా గ్రామ స్థాయిలో భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.
News March 11, 2026

NLR: సిలిండర్ల కొరత అంటూ ప్రచారం.. వాస్తవం ఇదే.!

జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని సంబంధిత శాఖ అధికారిని లీలారాణి తెలిపారు. జిల్లాలోని అన్ని అధీకృత LPG డిస్ట్రిబ్యూటర్ల వద్ద సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. సిలిండర్ల కొరత ఉందనే వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. ఎవరైనా డిస్ట్రిబ్యూటర్, ఏజెన్సీ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.