News September 11, 2025
లిక్కర్ స్కాం కేసులో సిట్ సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. హైదరాబాద్, విశాఖలో నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని స్నేహ హౌస్, రోడ్ నంబర్-2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్-రాజేంద్రనగర్, ఖైరతాబాద్-కమలాపురి కాలనీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని వాల్తేర్ రోడ్-వెస్ట్ వింగ్‌లో ఉన్న మరో కార్యాలయంలోనూ రైడ్ జరుగుతోంది.
Similar News
News September 11, 2025
గొర్రెల స్కాం.. బాధితులను విచారణకు పిలిచిన ఈడీ

TG: గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెలు కొనకుండానే రూ.కోట్లు కొట్టేశారనే ఆరోపణలపై విచారణ జరుపుతోంది. ఈ నెల 15న విచారణకు రావాలని బాధితులకు నోటీసులు జారీ చేసింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసి అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు అరెస్టవ్వగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSDపైనా కేసు నమోదైంది.
News September 11, 2025
‘మిరాయ్’లో ప్రభాస్?

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’లో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు రిలీజ్ నేపథ్యంలో.. హింట్ ఇస్తూ హీరో తేజ ట్వీట్ చేశారు. ‘ప్రభాస్ తన సహృదయంతో ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చారు. మూవీ ప్రారంభంలో రెబల్ సర్‌ప్రైజ్ మిస్ అవకండి’ అంటూ పేర్కొన్నారు. దీంతో ఆయన వాయిస్ ఓవర్ ఉంటుందా లేదా క్యామియో ఉంటుందా అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ కానుంది.
News September 11, 2025
ఆ ప్రచారాన్ని ఖండించిన మాస్టర్ బ్లాస్టర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ BCCI తదుపరి ప్రెసిడెంట్ కాబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారానికి తాజాగా సచిన్ తెరదించారు. ఆయనకు చెందిన SRT స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సచిన్‌కు సంబంధించి పలు రిపోర్ట్స్, రూమర్స్ మా దృష్టికి వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. ఊహాగానాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నాం’ అని పేర్కొంది.