News September 11, 2025

ఖమ్మంలో అటవీ అమరవీరులకు కలెక్టర్ నివాళి

image

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా అటవీశాఖ కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. అడవుల సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కార్యక్రమంలో DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, CP సునీల్ దత్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 3, 2026

ఖమ్మం: ఇంటింటికీ నల్లా.. పంచాయతీలకే తాగునీటి బాధ్యత

image

ఖమ్మం జిల్లాలో తాగునీటి కష్టాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పథకం సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లోని ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైపులైన్ల నిర్వహణ బాధ్యతలను ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. సర్పంచి అధ్యక్షతన ఉండే ‘గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల’ ద్వారా ప్రతి ఇంటికీ 100 శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చి, నిరంతర సరఫరాను పర్యవేక్షిస్తారు.

News March 3, 2026

ఖమ్మం: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదల

image

ఖమ్మంలో జనవరిలో నిర్వహించిన డ్రాయింగ్ హయ్యర్, లోయర్ అలాగే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రోల్ నంబర్ నమోదు చేసి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.

News March 3, 2026

నేడు ఖమ్మం కమిషనరేట్‌లో మద్యం దుకాణాలు బంద్‌

image

హోలీ పండుగను పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.