News September 11, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం

నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను గురువారం ఏ సమయంలో నైనా ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ భాగాల నుంచి వరద నీరు రావడంతో ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి దిగువన ఉన్న మంజీరా నదిలోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నది పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశుకాపరులు నదిలోకి దిగరాదని అధికారులు సూచించారు.
Similar News
News March 14, 2026
కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
News March 14, 2026
MHBD జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 99.91% హాజరు

మహబూబాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష(ఫస్ట్ లాంగ్వేజ్) ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో మొత్తం 8,151 మంది విద్యార్థులు నమోదు కాగా.. 8,144 మంది హాజరయ్యారు. 7 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.91 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.
News March 14, 2026
ఇల్లంతకుంట సీతారామచంద్రుని బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు తెలిపారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు వేడుకలు జరుగుతాయని వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత, రంగులు వేసే పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సుధాకర్, ధర్మకర్తలు పరమేష్, కిరణ్, రామ్ రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


