News September 11, 2025
పెద్దపల్లి: అటవీ అమరవీరులకు జోహార్లు: కలెక్టర్

సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో అడవుల సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీని ప్రారంభించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
Similar News
News March 13, 2026
సంగారెడ్డి జిల్లాకు రూ.2.10 కోట్లు ఎంపీ నిధులు

మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషితో సంగారెడ్డి జిల్లాకు భారీగా ఎంపీ నిధులు మంజూరయ్యాయని బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద వివిధ మండలాల్లోని 21 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.10 కోట్లు అనుమతి లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
News March 13, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు
News March 13, 2026
ఖమేనీ భార్య బతికే ఉన్నారు: ఇరాన్ మీడియా

US, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ <<19282331>>ఖమేనీ భార్య<<>> మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఇరానియన్ మీడియా ఖండించింది. ఆమె బతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్’ న్యూస్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడా ప్రస్తావించలేదు.


