News September 11, 2025
కాసేపట్లో జైలులో సరెండర్ కానున్న MP మిథున్ రెడ్డి

MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాసేపట్లో రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఆయనకు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియనుండటంతో నేటి సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కానున్నారు. ఇప్పటికే ఆయన విజయావాడకు చేరుకుని రాజమండ్రికి బయలుదేరారు.
Similar News
News September 11, 2025
ద్రావిడ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లకు దరఖాస్తులు

ద్రావిడ వర్సిటీలో వివిధ విభాగాల్లో పీహెచ్డీ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 14 శాఖలో 62 అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తులను వర్సిటీలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ సందర్శించాలని కోరారు.
News September 11, 2025
పలమనేరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

పలమనేరు నుంచి చిత్తూరు వెళ్లే ఘాట్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సామర్లగడ్డ గ్రామానికి చెందిన పవన్ (ప్రైవేటు ఫైనాన్స్ ఉద్యోగి) అక్కడికక్కడే మృతి చెందారు. వృత్తి నిమిత్తం బైక్ పై ప్రయాణిస్తుండగా, మొగిలి ఘాట్ వద్ద ట్రైన్ చక్రాలు తరలిస్తున్న లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. పవన్ మరణంతో అతడి కుటుంబం కన్నీటి పర్యంతమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 11, 2025
చిత్తూరు: పశువ్యాధి నివారణ గోడ పోస్టులు ఆవిష్కరించిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ చాంబర్లో జాతీయ పశువ్యాధి నియంత్రణ గోడపోస్టర్లను కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పశువులకు సమయానుకూలంగా టీకాలు వేయడం ద్వారా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని రైతులు, పశుపోషకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.