News September 11, 2025
గురుకులాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని ఈ సందర్భంగా సూచించారు. పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును పరిశీలించి, పలు సూచనలు చేశారు.
Similar News
News September 11, 2025
VZM: నేలబావిలో పడి వ్యక్తి మృతి

విజయనగరం మండలం రాకొడు గ్రామానికి చెందిన పి.రామారావు (35) ప్రమాదవశాత్తు నేలబావిలో పడి గురువారం మృతి చెందాడు. పశువుల మేతకు గడ్డి కోసం వెళ్లి నేలబావిలో జారి పడినట్లు మృతుని భార్య సంధ్య పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయనగరం రూరల్ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్ తెలిపారు.
News September 11, 2025
KNR: ‘డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల’

2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించిన దోస్త్ చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసిందని SRR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. దోస్త్ వెబ్ సైట్‌లో ఖాళీల వివరాలు అందుబాటులో ఉంటాయని, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ విద్యార్థులకు SEP 15, 16వ తేదీల్లో జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.
News September 11, 2025
HYD: మ్యాన్ హోల్ ఘటనపై స్పందించిన హైడ్రా

పాతబస్తీలోని యాకుత్‌పురాలో మ్యాన్ హోల్‌లో పడిపోయిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. బాధ్యులు ఎవరినే దానిపై ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని, స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టగా.. గట్టిగా ఉండడంతో జలమండలి మిషన్లతో తొలగించాలని నిర్ణయించారు. జలమండలి సిబ్బంది పని అయిన తర్వాత మ్యాన్ హోల్ మూత వేయకుండా వెళ్లిపోయినట్లు ప్రాథమిక సమాచారం.