News September 11, 2025
ఈనెల 15 నుంచి పశువులకు టీకాలు: కలెక్టర్

ఈనెల 15నుంచి అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయడం జరుగుతుందని పాడి రైతులంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2026
NTR జిల్లాకు రూ.67.69 కోట్లు మంజూరు

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం NTR జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలోని 1.18 లక్షలు మంది రైతుల ఖాతాల్లో రూ.67.69 కోట్ల నిధులు జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000ల చొప్పున జమ అవుతాయన్నారు. రైతులు ఈ నిధులను తదుపరి పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.
News March 12, 2026
HYD: గ్యాస్ లేకపోతే ఈ ఆలోచన మీకు రాదా?

రూ.5కే కడుపు నింపుతున్న సంస్థలు స్టీమ్ బాయిలర్లు వాడుతుంటే.. వేలల్లో బిల్లులు వసూలు చేసే 5 స్టార్ హోటళ్లు, హాస్టళ్లు గ్యాస్ వాడుతున్నాయి. గ్యాస్ ధర పెరిగిందని కస్టమర్ల జేబులు కత్తిరించే బదులు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్‌ల స్టీమ్ వంట పద్ధతికి మారితే ఖర్చు తగ్గుతుంది కదా. కార్పొరేట్ హాస్టళ్లు గ్యాస్ సంక్షోభం సాకుతో మెస్ ఛార్జీలు పెంచడం కరెక్టేనా? గ్యాస్ లేకపోతే.. స్టీమ్ బాయిలర్లు ఉన్నాయి. <<19364190>>సోచో జరా!<<>>
News March 12, 2026
జగన్ వ్యాఖ్యలు అబద్ధం: పయ్యావుల

AP: జగన్ చేసిన విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్న జగన్ వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేశారు. తాము రూ.1.05 లక్షల కోట్లే అప్పు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడా తగ్గలేదని, రెవెన్యూ లోటు ముందు నుంచే ఉందన్నారు. వైసీపీ హయాంలో ఎంత దోపిడీ జరిగిందనేది రేపో, మాపో ఈడీ బయటపెడుతుందని వ్యాఖ్యానించారు.


