News September 11, 2025

పెద్దపల్లి: ఉచిత తేనె టీగల పెంపకం శిక్షణను సద్వినియోగం చేసుకోండి

image

RG-3 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత తేనె టీగల పెంపకం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని RG-3 GM సుధాకరరావు అన్నారు. సింగరేణి సంస్థ సీఎస్ఆర్ కింద ప్రభావిత, పరిసర ప్రాంతాల మహిళలకు తేనె టీగల పెంపకంపై గురువారం శిక్షణ తరగతులను ప్రారంభించారు. తేనె టీగల పెంపకంపై మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్, అగర్తల, వెస్ట్ త్రిపుర రాష్ట్రం వారి ద్వారా ఏడు రోజులు ఉచిత శిక్షణతో పాటు సంబంధిత పరికరాలను అందిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News March 10, 2026

నేపాల్‌లో RSP ఘన విజయం.. మోదీ కంగ్రాట్స్

image

నేపాల్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 165 స్థానాలకు గాను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఘన విజయం సాధించిన RSP ప్రెసిడెంట్ రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.

News March 10, 2026

అగనంపూడి హైవేపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

అగనంపూడి టోల్గేట్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. అగనంపూడి ప్రాంతానికి చెందిన యువకుడు బలిరెడ్డి కిషోర్ ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు పక్కన మైలురాయిను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

News March 10, 2026

HYD: PF సమస్యలు ఉన్నాయా? ఇక్కడికి రండి

image

EPFOకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు బాలానగర్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో ఉన్న EPFO కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. PF విత్‌డ్రా, నామినీ యాడ్ చేయడం, KYC అప్‌డేట్, అకౌంట్ సంబంధిత ఇతర సమస్యలను అక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.