News September 11, 2025
ALERT: కాసేపట్లో భారీ వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే మెదక్‌లో 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. అటు హైదరాబాద్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు దంచికొడుతున్నాయి.
Similar News
News September 11, 2025
ALERT: మీరు గురక పెడతారా?

చాలామందికి నిద్రలో గురక రావడం సాధారణం. అయితే బిగ్గరగా గురక పెట్టేవారిని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది స్లీప్ ఆప్నియాకు సంకేతం కావొచ్చని, చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆక్సిజన్ సరిగా అందక గుండెపోటు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. బ్రీతింగ్ మాస్కులు వాడటం, వెయిట్ తగ్గడం, సర్జరీ ఇతర చికిత్సల ద్వారా నయమవుతుందని సూచిస్తున్నారు.
News September 11, 2025
అమరావతిలో బ్యాంకర్ల బృందం పర్యటన

AP: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల బృందం పర్యటించింది. నగర అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టు కింద అమలవుతున్న పర్యావరణ, సామాజిక రక్షణ కార్యకలాపాలను పరిశీలించింది. CRDA అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులకు సూచనలు చేసింది. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ నర్సరీ, CRDA స్కిల్ హబ్ ప్రాంగణం, N9 ట్రంక్ రోడ్ పనులు, శాఖమూరు, నీరుకొండ రిజర్వాయర్‌ల వద్ద రక్షణ చర్యలను చెక్ చేసింది.
News September 11, 2025
గొర్రెల స్కాం.. బాధితులను విచారణకు పిలిచిన ఈడీ

TG: గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెలు కొనకుండానే రూ.కోట్లు కొట్టేశారనే ఆరోపణలపై విచారణ జరుపుతోంది. ఈ నెల 15న విచారణకు రావాలని బాధితులకు నోటీసులు జారీ చేసింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసి అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు అరెస్టవ్వగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSDపైనా కేసు నమోదైంది.