News September 11, 2025

ఉల్లి రైతులను మోసగిస్తే కఠిన చర్యలు: కలెక్టర్, ఎస్పీ

image

కర్నూలు మార్కెట్ యార్డులో గురువారం ఉదయం లెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యటించారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం యార్డ్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అమ్మకానికి వచ్చిన ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా వారికి సహకరించాలన్నారు. రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News March 12, 2026

కర్నూలు జిల్లాలో 1.75 లక్షల హెక్టార్లలో రబీ పంటల సాగు

image

కర్నూలు జిల్లాలో 2025-26 రబీ సీజన్ పంటల నమోదు ప్రక్రియ పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి గురువారం తెలిపారు. రైతు సేవా కేంద్రాల వారీగా వివరాలు అందుబాటులో ఉంచమని రైతులు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా రైతు సేవా కేంద్రాల్లో తెలియజేయాలన్నారు. అభ్యంతరాలకు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయవచ్చని సూచించారు.

News March 12, 2026

కర్నూలులో 261 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 4,590 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 4329 మంది మాత్రమే పరీక్ష రాశారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

News March 12, 2026

కర్నూలులో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!

image

కర్నూలులోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్‌లో ఉన్న నందనం డిగ్రీ కాలేజీలో ఈనెల 14న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీల్లో సుమారు 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చదివినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కళాశాల కరెస్పాండెంట్ జనార్ధన్ తెలిపారు.