News April 4, 2024
రెబల్ నేతలకు కాంగ్రెస్ ‘సెండాఫ్’
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే రెబల్ నేతలకు కాంగ్రెస్ సెండాఫ్ ఇస్తోంది. ఇటీవల తెలంగాణలో PCC మాజీ జనరల్ సెక్రటరీ బక్క జడ్సన్‌పై వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా.. మహారాష్ట్రకు చెందిన సీనియర్ లీడర్ సంజయ్ నిరుపమ్‌ను సైతం పార్టీ నుంచి తొలగించింది. సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారని తెలిపింది. వీరిద్దరిపై రాబోయే 6ఏళ్ల పాటు ఈ సస్పెన్షన్ కొనసాగనుంది.
Similar News
News November 14, 2024
నేడు డయాబెటిస్ డే: ఈ జాగ్రత్తలు తీసుకోండి
రక్తంలో చక్కెరల/గ్లూకోజ్‌ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, కిడ్నీ సమస్యలు రావచ్చు. తరచూ దాహం, ఎక్కువగా మూత్రవిసర్జన, అలసట, బరువు తగ్గడం, పుండ్లు, చూపులో క్షీణత దీని లక్షణాలు. షుగర్ లెవెల్స్ ఎక్కువుండే ప్రాసెస్డ్ ఫుడ్, డ్రింక్స్ తీసుకోవద్దు. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సొర, కాకర, ఆకుకూరలు, జొన్న, రాగులతో చక్కెర స్థాయులు తగ్గుతాయి.
News November 14, 2024
DEC 31 వరకు కాళేశ్వరం కమిషన్ గడువు
TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం DEC 31 వరకు పొడిగించింది. ఆలోగా నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. ఈ ఏడాది మార్చి 14న ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులను విచారించింది. ఈ నెలలో ఐఏఎస్‌లను, ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం ఉంది.
News November 14, 2024
నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసి గబ్బర్డ్
డెమొక్రటిక్ మాజీ నేత తులసి గబ్బర్డ్‌ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. డెమొక్రటిక్ విధానాలతో విభేదించిన గబ్బర్డ్ 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఆమె గొప్ప స్ఫూర్తిని తీసుకురాగలరని ట్రంప్ కొనియాడారు.