News September 11, 2025

అమలాపురం పోలీసులకు తప్పిన ప్రమాదం

image

సీఎం చంద్రబాబు పర్యటనకు అనంతపురం వెళ్లిన అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, ఉప్పలగుప్తం సబ్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్‌లకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు వద్ద వీరి కారును ఓ మినీ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఇద్దరు పోలీసులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News April 2, 2026

NZB: 1,300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు: CP

image

హనుమాన్ శోభాయాత్రను శాంతి యుతంగా నిర్వహించేందుకు 1,300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు NZB CP సాయి చైతన్య తెలిపారు. అలాగే CC, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్‌లతో 24/7 పటిష్ఠమైన నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. NZBతో పాటు ఖమ్మం, రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బందిని రప్పించామన్నారు.

News April 2, 2026

BREAKING: ఐప్యాక్ ఆఫీసుల్లో ఈడీ రైడ్స్

image

పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్‌ ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో హైదరాబాద్, బెంగళూరు, ముంబైలోని కార్యాలయాల్లో తనిఖీలు చేస్తోంది. ఐప్యాక్ ఫౌండర్స్ నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై ఈడీ వివరాలు వెల్లడించాల్సి ఉంది.

News April 2, 2026

నిర్మల్: రూ.100 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన..?

image

బాసర జ్ఞాన సరస్వతి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో పర్యటించి, రూ.100 కోట్ల మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని, ఈ పర్యటన క్షేత్ర అభివృద్ధికి కీలకమని ముధోల్ నియోజకవర్గ ఇంచార్జి నారాయణ రావు పటేల్ తెలిపారు.