News September 11, 2025

దసరాకి ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు: మంత్రి వాసంశెట్టి

image

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గురువారం రామచంద్రాపురంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిలో భాగంగా దసరా పండుగకు ఆటో డ్రైవర్లకు రూ.15,000 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన ‘సీఎం అంటే కామన్ మ్యాన్’ అనేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 18, 2026

‘భూ భారతి’లో 4వేల దరఖాస్తులు రామచంద్రాపురానివే..!

image

రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూ భారతి’పోర్టల్‌కు జిల్లాలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 4వేల అప్లికేషన్లు రామచంద్రాపురానివే. మంత్రి సీతక్క చొరవతో కలెక్టర్ దివాకర 10,500 ఎకరాలకు శాశ్వతంగా హద్దులు నిర్ణయించి పట్టాలు ఇచ్చేందుకు రీ సర్వేకు పూనుకున్నారు. గతంలో 1974-75, 1982, 1992, 2008లో కూడా సర్వేలు జరిగినా సత్ఫలితం రాలేదు. ఇప్పుడైనా పరిష్కారం వస్తుందని రైతులు భావిస్తున్నారు.

News March 18, 2026

PHOTOS: ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభోత్సవం

image

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించింది. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి 11 కి.మీ. బస్సులో ప్రయాణించారు. వారి బాగోగులు, సమస్యలు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అంతకుముందు సీఎం తన నివాసంలో దివ్యాంగులకు విందు ఇచ్చారు. ఆ కార్యక్రమ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News March 18, 2026

మక్తల్: బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు నిధులు తేవడంలో విఫలం

image

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్రం నుంచి నిధులు తేవడంలో విఫలం అయ్యారని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీ సమావేశాల్లో విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు, తెలంగాణకు వచ్చిన నిధులు బేరీజు వేసుకోవాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరిని కోళ్లు, మేకల శాఖ మంత్రి అంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంబోధించడాన్ని సహచర మంత్రులు ఖండించారు.