News September 11, 2025

సికింద్రాబాద్: కావేరీ సీడ్స్ వద్ద రైతులు నిరసన

image

సికింద్రాబాద్ పారడైస్‌లోని కావేరీ సీడ్స్ వద్ద ఛత్తీస్‌గఢ్ రైతులు గురువారం నిరసనకు దిగారు. కావేరి సీడ్స్ వేసి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద ఇచ్చారని పేర్కొన్న రైతులు ఒక్కో ఎకరానికి రూ.50 వేలు చెల్లించి నష్టాన్ని పూడ్చాలని కోరారు.

Similar News

News September 11, 2025

NRPT: వరద నష్టంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

నిరంతరం కురుస్తున్న వర్షాలకు జిల్లాలో రోడ్లు, భవనాలు, కల్వర్టలు, స్కూల్ భవనలు, వసతి గృహాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్లకు ఏమైనా నష్టం కలిగితే తాత్కాలిక మరమ్మతులకు సంబందించిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. వరద నష్టంపై గురువారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ అధికారులతో సమీక్ష చేశారు. మండలాల వారిగా నివేదికలు తయారు చేయాలన్నారు.

News September 11, 2025

NTR: పోలీసుల కోసం ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్

image

పోలీసుల, వారి కుటుంబాల ఆరోగ్య సంరక్షణ కోసం ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్‌ను విజయవాడ సీపీ రాజశేఖరబాబు గురువారం ప్రారంభించారు. 1991 బ్యాచ్ పోలీసులు, వైద్యుల సహకారంతో ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా ఉచిత కన్సల్టెన్సీ, చికిత్సపై 20-30% రాయితీలు లభిస్తాయని సీపీ తెలిపారు. ఇప్పటి వరకు 14,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు.

News September 11, 2025

నేపాల్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న సిక్కోలు వాసులు

image

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు గురువారం సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా వాసులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు చొరవతో జిల్లా వాసులను క్షేమంగా తీసుకురాగలిగామన్నారు.