News September 11, 2025
చిక్కడపల్లిలో BRSV ఆందోళన

చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేశారు. BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనియాస్ యాదవ్ ఆధ్వర్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరశన కార్యక్రమం నిర్వహించారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవుకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల గ్రూప్-1 పరీక్షలను రివాల్యుయేషన్ చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేశారు.
Similar News
News September 12, 2025
HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ హనుమకొండలో 51, వరంగల్లో 60 ట్రాఫిక్ కేసులు
✓ HNK: పట్టుబడిన పేకాట రాయుళ్లు
✓ డ్రగ్స్ సమాచారాన్ని అందించండి: WGL పోలీస్
✓ WGL: భారీగా పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు
✓ పరకాల మాజీ జడ్పీటీసీ మృతి
✓ HNK: ఆడుకుంటూ కుప్ప కూలిన విద్యార్థి
✓ సైబర్ నేరాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి: ACP
✓ మిల్స్ కాలనీ పరిధిలో పట్టుబడిన పేకాట రాయుళ్లు
News September 12, 2025
బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో టీటీడీ ఈవో భేటీ

AP: బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ అధికారులకు సూచించారు. ఈ వేడుకల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని చెప్పారు. రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని తెలిపారు. 3,500 మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని, మెట్ల మార్గాల్లో భద్రత మరింత పటిష్ఠం చేయాలని దిశానిర్దేశం చేశారు.
News September 12, 2025
జగిత్యాల: లెక్క తేలింది.. ఎన్నికలే తరువాయి..!

జగిత్యాల జిల్లాలో ZPTC, MPTC ఎన్నికల ఓటరు జాబితాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,07,263 ఉండగా, ఇందులో పురుషులు 2,89,266, మహిళలు 3,17,988, ఇతరులు 9 మంది ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించారు. జగిత్యాల రూరల్ మండలంలో అత్యధికంగా, జగిత్యాల అర్బన్‌లో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 20 ZPTC, 216 MPTC స్థానాలు ఉండగా 1,123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.