News September 11, 2025
“స్ఫూర్తి పథం” కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి “స్ఫూర్తి పథం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి 213 ప్రభుత్వ హైస్కూళ్లలోని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మరింత అవగాహన కల్పించనున్నారు.
Similar News
News March 17, 2026
రాజమండ్రి: రేపు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం- కలెక్టర్

ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగశక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మార్చి 18న బుధవారం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో దివ్యాంగశక్తి పథకంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయిలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభించి, దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తారన్నారు.
News March 17, 2026
రాజమండ్రి: మార్చి 19న ఉగాది పురస్కారాలు

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని కవులు, పండితులు, కళాకారులను గౌరవించేందుకు మార్చి 19న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం’ నిర్వహించనున్నట్లు MP పురందీశ్వరి మంగళవారం తెలిపారు. నగరంలోని జె.కె. గార్డెన్స్ వద్ద ఈ వేడుకకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను సముచిత రీతిలో సన్మానిస్తామని వెల్లడించారు.
News March 17, 2026
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కృషి: కలెక్టర్

జిల్లాలో అక్షరాంధ్రా కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్య వయోజనులకు ప్రాథమిక భాష, గణిత నైపుణ్యాల పరీక్షను సమర్థవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ పరీక్షకు 88,647 మంది నమోదు చేసుకోగా, 88,114 మంది హాజరయ్యారు. కేవలం 533 మంది మాత్రమే గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.


