News April 4, 2024
ఎన్టీఆర్: స్నేహితుడిని చంపిన వ్యక్తికి జీవిత ఖైదు

ఇబ్రహీంపట్నంలో 2016 జూలై 10న జరిగిన హత్య కేసులో ముద్దాయి ప్రకాశ్ సింగ్ (50)కు 13వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి శేషయ్య బుధవారం జీవిత ఖైదు విధించారు. సదరు ప్రకాశ్ సింగ్, తన స్నేహితుడు నరేశ్‌ను మద్యం కోసం డబ్బులడగగా, నిరాకరించడంతో రాయితో కొట్టి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని కోర్టు తమ తీర్పులో వెల్లడించింది. సదరు ముద్దాయికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించినట్లు చెప్పారు.
Similar News
News July 7, 2025
మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు

మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీవో స్వాతి, తదితరులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News July 7, 2025
నేడు ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు కలెక్టర్

ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఈనెల 10న వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో పెట్టుకొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ట్రస్టును సందర్శించనున్నారు.
News July 7, 2025
మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వివినియోగం చేసుకోవాలని కోరారు.