News September 11, 2025

JNTUH: 18, 19 తేదీల్లో స్పాట్ అడ్మిషన్స్

image

JNTUHలో ఎంటెక్ (స్పాన్సర్డ్) సీట్ల కోసం ఈ నెల 18, 19 తేదీలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ర్టార్ తెలిపారు. ఫుల్ టైం ఎంటెక్ కోర్సుల్లో చేరాలనుకునే వారు అడ్మిషన్స్ కార్యాలయంలో ఉ.10 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. స్పెషలైజేషన్, అర్హతలు, స్పాన్సర్డ్ సర్టిఫికెట్ల వివరాలు, ట్యూషన్ ఫీజు తదితర పూర్తి వివరాల కోసం www.jntuh.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని వివరించారు.

Similar News

News March 4, 2026

HYD: మెట్రో హంగులకు ఇక గుడ్-బై!

image

L&T చేతిలో ఉన్న HYD మెట్రో ఫేజ్-1 ఇక పక్కా ప్రభుత్వ ఆస్తి కాబోతోంది. MAR 31 నాటికి అప్పగింత పూర్తి కావాల్సిందేనని CS నుంచి డెడ్ లైన్ వచ్చింది. సుమారు రూ.15,000 కోట్ల భారీ డీల్ ఇది. ఈ డబ్బు కోసం ప్రభుత్వం ఇప్పుడు IRFC దగ్గర తక్కువ వడ్డీకి అప్పు కోసం తిరుగుతోంది. ప్రభుత్వ మెట్రోలో సామాన్యుడికి టికెట్ ధరలు తగ్గుతాయా?, కనీస మెయింటెనెన్స్ లేక మెట్రో ‘ఆర్టీసీ’లా మారుతుందా? అని జనం టెన్షన్ పడుతున్నారు.

News March 4, 2026

3 ముక్కల HYD.. ‘గ్రేటర్’ కథ కంచికే!

image

FEB 10తో GHMC కౌన్సిల్ పదవీకాలం ముగియడమే ఆలస్యం.. సర్కారు సిటీని 3 ముక్కలు చేస్తూ GO నం. 55 ఇచ్చేసింది. ఈ ముక్కలాట వెనుక అసలు కిటుకు వార్డుల పునర్విభజన. పాతబస్తీ పట్టు తగ్గించి కొత్త ఏరియాల్లో పొలిటికల్ పవర్ మార్చడమే అసలు ప్లాన్ అని విశ్లేషకులు అంటున్నారు. ఏటా రూ.2,000 కోట్ల ట్యాక్స్ కట్టే IT ఏరియా CYB కిందకి వెళ్లడంతో GHMC డెవలప్‌మెంట్ కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారో? అన్నది సవాల్‌గా మారింది.

News March 4, 2026

ఇరాన్‌తో HYDకు స్పెషల్ ATTACHMENT..!

image

ఇరాన్‌తో HYDకు విడదీయరాని అనుబంధం ఉంది. బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం, జామున్, జిలేబీ, సమోసా ఇరానీలు పరిచయం చేసినవే. గోల్కొండ, చార్మినార్ చారిత్రక కట్టడాల్లోనూ పర్షియన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇక్కడి తెలుగు, ఉర్దూ భాషలపైనా ఇరాన్ పదాల ప్రభావం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ పేరుతో బంజారాహిల్స్‌లో కాన్సులేట్, రోడ్డు, పాతబస్తీలో ఇరానీ గల్లీ కూడా ఉందంటే ఇరాన్‌తో HYDకున్న రిలేషన్‌ను అర్థం చేసుకోవచ్చు.